Nayanthara : ఆ హీరో అయితే అసలు సినిమానే చేయను.. అంటున్న‌ నయనతార..

November 15, 2021 8:38 PM

Nayanthara : సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నయనతార. ఈమె క్రేజ్ సినీ ఇండస్ట్రీలో అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు సైతం ఈమె డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈమె మారింది.

Nayanthara said she will not act with that actor

సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడీ కట్టేస్తుంది ఈ బ్యూటీ. ఈమెకు నిర్మాతలు అందించే రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటోంది. లేటెస్ట్ గా ఆమె అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇక తెలుగులో చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళ సినిమా లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. లూసిఫర్ సినిమాలో మంజూ వారియర్ నటించిన పాత్రలో గాడ్ ఫాదర్ లో నయనతార యాక్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి ఈమె రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. అయితే ఈ సినిమాలో నయన్ కు భర్తగా టాలీవుడ్ హీరో సత్యదేవ్ యాక్ట్ చేస్తున్నారు.

ఈ పాత్రలో మలయాళంలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఇప్పుడు నయన్, తన భర్తగా సత్యదేవ్ ను వద్దని అంటున్నారట. సత్యదేవ్ కు తన పక్కన నటించేంత ఇమేజ్ లేదని అన్నారట. మరి సత్యదేవ్ ను నయన్ భర్త పాత్రలో ఉంచుతారా.. తీసేసి వేరే నటుడ్ని పెడతారా అనేది తెలియాల్సి ఉంది.

నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇక నయనతార బాలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now