Nayanthara : ప్రియుడితో నయనతార రహస్య వివాహం..?

March 14, 2022 2:27 PM

Nayanthara : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన సినీ కెరీర్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగడమే కాకుండా నిత్యం ప్రేమ, బ్రేకప్ అంటూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. ఇక గత కొంతకాలం నుంచి నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట తరచూ మీడియా కంటబడడంతో వీరి ప్రేమ విషయం బయటపడింది.

Nayanthara reportedly married her lover vignesh shivan
Nayanthara

ఇలా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి దేశవిదేశాలను తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని.. త్వరలోనే ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా వీరి పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు.

అయితే నయనతారకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూస్తే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి కూడా రహస్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. తాజాగా తన ప్రియుడితో కలిసి తమిళనాడులోని ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళిన నయనతార తన నుదుటిపై సిందూరం పెట్టుకోవడంతో వీరిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగిందని.. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచేస్తున్నారని భావించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. ఈ జంట ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now