Nayanthara : జ‌య‌లలిత, ర‌జ‌నీకాంత్ ఇళ్ల ద‌గ్గ‌ర‌లో ఇల్లు కొనుగోలు చేసిన న‌య‌న‌తార‌..!

November 27, 2021 8:45 PM

Nayanthara : అద్భుత‌మైన న‌ట‌న‌తో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌య‌న‌తార ప్ర‌స్తుతం సీనియర్ స్టార్స్‌తో కాకుండా కుర్ర హీరోల‌తోనూ జ‌త క‌డుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌ల‌లో వ‌రుస ఆఫర్స్ అందుకుంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. 37 ఏళ్ల వ‌య‌స్సులోనూ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తోంది. సుదీర్ఘ కాలంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతోంది.

Nayanthara : జ‌య‌లలిత, ర‌జ‌నీకాంత్ ఇళ్ల ద‌గ్గ‌ర‌లో ఇల్లు కొనుగోలు చేసిన న‌య‌న‌తార‌..!
Nayanthara

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నయన్ అత్యంత పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా.. వుమెన్ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ లేడీ సూపర్ స్టార్‏గా మారింది. కొన్నాళ్లుగా విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ ముద్దుగుమ్మ వ‌చ్చే ఏడాది అత‌నిని వివాహం చేసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజ‌గా న‌య‌న‌తార‌కు సంబంధించిన ఓ వార్త వైర‌ల్‌గా మారింది.

నయనతార తాజాగా చెన్నైలోని పొయెస్‌ గార్డెన్‌లో ఫోర్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్‌ విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఇక నయనతార ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఈ ఇంటిలో విఘ్నేష్‌తో కలిసి జీవించనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నయనతార పెళ్లి వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్‌ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్‌ ఇంటిపక్కనే ధనుష్‌ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now