Nayanthara : న‌య‌న‌తార పెళ్లికి కండిష‌న్ పెట్టిన ఆమె అత్త‌.. అలా చేస్తేనే.. లేక‌పోతే..?

June 9, 2022 7:43 AM

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌ట‌న‌ప‌రంగా మంచి మార్కుల‌నే కొట్టేసింది. గ‌తంలో ఈమె గ్లామ‌ర్ షో చేసేది. కానీ త‌రువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేస్తూ గ్లామ‌ర్ షోకు గుడ్ బై చెప్పేసింది. అయితే అప్ప‌ట్లో ఈమె ప్ర‌భుదేవాతో ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరు పెళ్లి కూడా చేసుకుందామ‌నుకున్నారు. న‌య‌న‌తార అప్ప‌ట్లో బాల‌య్య‌తో క‌లిసి శ్రీరామ‌రాజ్యం అనే మూవీలో న‌టించింది. ఇక పెళ్లి చేసుకున్నాక యాక్టింగ్ కు గుడ్‌బై చెబుతున్నాన‌ని.. ఇదే త‌న‌కు ఆఖరు సినిమా అని ఆమె శ్రీ‌రామ‌రాజ్యం సెట్‌లో క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అలాగే అంద‌రి ఆశీస్సుల‌ను కూడా తీసుకుంది.

అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ప్ర‌భుదేవాకు ఆమె బ్రేక‌ప్ చెప్పింది. వారు విడిపోయారు. అయితే న‌య‌న్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్ర‌భుదేవా ఏకంగా త‌న భార్య‌కే విడాకులు ఇచ్చాడు. త‌రువాత భంగ‌ప‌డ్డాడు. ఇక అది ముగిసిన అధ్యాయం. అయితే ఆ త‌రువాత న‌య‌న‌తార మ‌ళ్లీ సినిమాల్లో కంటిన్యూ అయింది. ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డింది. వీరు గ‌త 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అనేక సంద‌ర్భాల్లో ఒక‌రికొక‌రు ఐ ల‌వ్ యూ కూడా చెప్పుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రూ ఎట్ట‌కేల‌కు వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌వుతున్నారు. మ‌హాబ‌లిపురంలో వీరి వివాహ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది.

Nayanthara mother in law put condition for her marriage
Nayanthara

అయితే న‌య‌న‌తార‌ను కోడ‌లిగా అంగీక‌రించేందుకు ఆమె అత్త‌.. విగ్నేష్ శివ‌న్ త‌ల్లి మీనాకుమారి ఒక కండిష‌న్ పెట్టార‌ట‌. పెళ్లి త‌రువాత యాక్టింగ్ మానేయాల‌ని.. అవ‌న్నీ త‌మ‌కు అచ్చిరావ‌ని.. క‌నుక పెళ్లి చేసుకున్న అనంత‌రం యాక్టింగ్‌ను మానేస్తా.. అంటేనే పెళ్లికి అనుమ‌తిస్తామ‌ని.. ఆమె అన్నార‌ట‌. దీంతో న‌య‌న్ అందుకు అంగీక‌రించింద‌ట‌. అయితే ఈమె ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. క‌నుక పెళ్లి అనంత‌రం ఈ మూవీల‌ను పూర్తి చేసి ఇక త‌న సినీ కెరీర్‌కు గుడ్ బై చెబుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్తే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now