Nayanthara Marriage : న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ ల పెళ్లి జ‌రిగిపోయింది.. ల‌క్ష మందికి అన్న‌దానం చేసిన జంట‌..!

June 9, 2022 12:41 PM

Nayanthara Marriage : గ‌త 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న న‌య‌నతార, విగ్నేష్ శివ‌న్‌ల జంట ఎట్ట‌కేల‌కు వివాహ బంధం ద్వారా ఒక్క‌టైంది. గురువారం ఉద‌యం 10.24 గంట‌ల‌కు వీరు హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వివాహం చేసుకున్నారు. విగ్నేష్ శివ‌న్.. న‌య‌న‌తార మెడ‌లో తాళి క‌ట్ట‌డం ద్వారా వీరు భార్యాభ‌ర్త‌లు అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఈ వివాహ వేడుక‌కు అనేక మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. వారు నూత‌న దంప‌తుల‌కు ఆశీర్వాదాలు అంద‌జేశారు.

కాగా త‌మ పెళ్లి సంద‌ర్భంగా ఈ జంట ఓ గొప్ప ప‌నిచేశారు. రాష్ట్రంలో ప‌లు ఎంపిక చేసిన ఆల‌యాల‌తోపాటు ఇత‌ర చోట్ల మొత్తం క‌లిపి ఒక ల‌క్ష మంది పేద‌ల‌కు అన్న‌దానం చేశారు. కాగా వీరి వివాహ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్‌, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ సేతుప‌తి, సూర్య‌, కార్తి, జ్యోతిక‌, ద‌ర్శ‌కులు మోహ‌న్ రాజా, శివ‌, కేఎస్ ర‌వికుమార్‌, అట్లీ, శ‌ర‌త్ కుమార్‌, రాధిక, ఎస్‌జే సూర్య‌, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌లు హాజ‌ర‌య్యారు. వీరు వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Nayanthara Marriage with Vignesh Sivan held in grand way
Nayanthara Marriage

ఇక న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్‌ల వివాహం సంద‌ర్భంగా ప‌క‌డ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మ‌హాబ‌లిపురంలోని షెర‌టాన్ గ్రాండ్‌లో వీరి వివాహం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. పోలీసులు వీరి వివాహానికి హై సెక్యూరిటీ క‌ల్పించారు. అలాగే 80 మంది బౌన్స‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే న‌య‌న్ పెళ్లి వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment