Nayanthara : న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్‌.. ఫ‌స్ట్ నైట్ కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు చేశారా ?

July 7, 2022 2:44 PM

Nayanthara : ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌, న‌టి న‌య‌న‌తారలు ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వివాహం చేసుకున్నారు. మ‌హాబ‌లిపురంలో వీరి వివాహం గ్రాండ్‌గా జ‌రిగింది. సుమారుగా 7 ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేల‌కు పెళ్లి బంధానికి ఆహ్వానం ప‌లికారు. అయితే పెళ్లికి ముందే వీరు అనేక ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు తిరిగారు. పూజ‌లు చేశారు. న‌య‌న‌తార జాత‌కంలో దోషం ఉంద‌ని.. అందుక‌నే పూజ‌లు చేశార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వీళ్లిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. క‌నుక ఇక ఆ రూమ‌ర్స్‌కు శాశ్వ‌తంగా చెక్ ప‌డిన‌ట్లు అయింది.

కాగా న‌య‌న్‌, విగ్నేష్ దంప‌తులు హ‌నీమూన్ కోసం బ్యాంకాక్‌కు కూడా వెళ్లారు. అయితే ఫ‌స్ట్ నైట్ కోసం వీరిద్ద‌రూ చేసిన ఖ‌ర్చు గురించే ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. వీరు త‌మ తొలి రోజున బాగానే ఖ‌ర్చు చేసిన‌ట్లు సమాచారం. విగ్నేష్ న‌య‌న్‌కు ఫ‌స్ట్ నైట్ రోజు రూ.2 కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ట‌. అలాగే ఆమెకు ఎంతో ఇష్ట‌మైన ఓ హ్యాండ్ బ్యాగ్‌ను కూడా రూ.2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కొనిచ్చాడ‌ట‌. దీంతోపాటు వీరు తొలి రోజు పూల కోస‌మే రూ.3 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వీరు బ‌స చేసిన హోట‌ల్‌లో త‌మ గ‌దిని ప్ర‌త్యేకంగా అలంక‌ర‌ణ చేయించార‌ట కూడా. ఇలా త‌మ ఫ‌స్ట్ నైట్ కోసం ఈ జంట భారీగా ఖర్చు పెట్టిన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Nayanthara and Vinesh Shivan spent huge amount
Nayanthara

కాగా న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ దంప‌తులు ఈ మ‌ధ్యే హ‌నీమూన్ ముగించుకుని వ‌చ్చారు. వ‌చ్చీరాగానే న‌య‌నతార నేరుగా షూటింగ్‌లో జాయిన్ అయింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారూఖ్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న జ‌వాన్ చిత్రంలో న‌య‌న్ న‌టిస్తోంది. అలాగే మెగాస్టార్ గాడ్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే పెళ్లి సంద‌డి ముగియ‌గా ప్ర‌స్తుతం న‌య‌న్‌, విగ్నేష్ దంప‌తులు మళ్లీ సినిమాల బిజీలో ప‌డిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now