Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌లు జూన్ 9న మహాబలేశ్వరంలో సంప్రదాయబద్దంగా ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు వచ్చారు. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ లు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో హక్కులను రూ.25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ వివాదం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
నయనతార, విగ్నేష్ దంపతులు తమ పెళ్లి ఫొటోలను నెల రోజులు కూడా కాకముందే డీల్‌కు విరుద్ధంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని.. కనుక వారి పెళ్లి వీడియోకు గాను ముందుగా అనుకున్న మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని అందిస్తామని నెట్‌ఫ్లిక్స్ వారికి షాకిచ్చిందని.. వార్తలు వచ్చాయి. అయితే వీటిని నయనతార టీమ్ కొట్టి పారేసింది. అలాంటిదేమీ లేదని.. వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ఇక నెట్ ఫ్లిక్స్‌లో వీరి పెళ్లి వీడియో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
అయితే నయన్, విగ్నేష్‌ల పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్‌లో ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలియదు. కానీ త్వరలోనే ఆ వీడియోను వారు స్ట్రీమ్ చేస్తారని సమాచారం. ఇక పెళ్లి అనంతరం ఈ దంపతులు బ్యాంకాక్‌కు హనీమూన్‌కు వెళ్లి వచ్చారు. తరువాత నయనతార యథావిధిగా షూటింగ్‌లలో పాల్గొంటోంది. ఈమె ప్రస్తుతం షారూఖ్ ఖాన్ పక్కన జవాన్ అనే మూవీలో నటిస్తోంది. దీనికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…