నవరాత్రి మొదటి రోజు అమ్మవారి అలంకరణ, పూజా విధానం !

October 7, 2021 10:21 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో దేవీ నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రులలో నేడు మొదటిరోజు కావడంతో అమ్మవారు మనకు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు.

navrathri first day durga pooja and decoration

నవరాత్రి మొదటి రోజులో భాగంగా అమ్మవారికి ఏ విధమైన వస్త్రాలను సమర్పించాలి. ఎలాంటి నైవేద్యం పెట్టాలి ? ఏ విధమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రిగా రెండు సంవత్సరాల బాలిక రూపంలో పూజిస్తాము. అమ్మవారికి నేడు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. అదేవిధంగా మల్లెపువ్వులు, జాజిపువ్వులతో అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా మొదటిరోజు నైవేద్యంగా అమ్మవారికి పొంగలి సమర్పించాలి.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు చేసేవారు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలి. కలశం ముందు అఖండ దీపం వెలిగించిన వారు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నేడు పూజ చేయడానికి ఉదయం 10:30 నుంచి 12, సాయంత్రం 6:00 నుంచి 7:30 గంటల వరకు ఎంతో అనువైన సమయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now