Natu Natu Song : నాటు నాటు సాంగ్‌.. ఒక్కో స్టెప్ డ్యాన్స్ చేసేందుకు ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్‌లు విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు..!

November 23, 2021 5:39 PM

Natu Natu Song : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన నాటు నాటు సాంగ్‌కు ఆలిండియా లెవ‌ల్‌లో విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఎంత‌గా అంటే.. అభిమానులు ఈ సాంగ్‌కు త‌మ సొంత శైలిలో స్టెప్పులు వేస్తూ అల‌రిస్తున్నారు.

Natu Natu Song ntr and ram charan worked hard for dance steps

నాటు నాటు సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల్లోకి బ‌లంగా వెళ్లింద‌ని చెప్ప‌వ‌చ్చు. విడుద‌లై 12 రోజులు అయ్యే స‌రికి 27 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇది కేవ‌లం తెలుగు వెర్ష‌న్‌కు మాత్ర‌మే. మిగిలిన భాష‌ల‌ను కూడా క‌లిపితే వ్యూస్ ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ పాట‌లో ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్‌లు వేసిన స్టెప్పుల‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

స‌హ‌జంగానే ఈ ఇద్ద‌రూ డ్యాన్స్ బాగా చేస్తారు. అలాంటిది ఇద్ద‌రూ క‌లిసి ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం.. అదీ.. ఇలా డ్యాన్స్ చేయ‌డం.. అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రిస్తోంది. ఇక ఈ పాట‌కు స్టెప్పులు వేయ‌డం కోసం చ‌ర‌ణ్‌, తారక్‌లు ఇద్ద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఇద్ద‌రూ ప‌ర్‌ఫెక్ట్ సింక్‌లో డ్యాన్స్ చేసేందుకు గాను ఈ సాంగ్‌కు ఒక్కో సారి 15 నుంచి 18 టేక్స్ కొన్ని సీన్ల‌కు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తార‌క్ తెలిపాడు.

ఈ పాట‌ను షూట్ చేస్తున్నప్పుడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తి స్టెప్‌ను నిశితంగా ప‌రిశీలించార‌ని.. త‌మ‌ను ఇబ్బందులు పెట్టినా.. చివ‌ర‌కు వ‌చ్చిన ఔట్‌పుట్‌ను, ప్రేక్ష‌కుల స్పంద‌న‌ను చూస్తుంటే.. తాము ప‌డ్డ క‌ష్టం అంతా మ‌రిచిపోయామ‌ని.. ఎన్‌టీఆర్ తెలిపారు.

చాలా మంది ఈ పాట‌ను చూసి ఇద్ద‌రూ క‌ల‌సి అంత ప‌ర్‌ఫెక్ట్ సింక్‌లో ఎలా డ్యాన్స్ చేశార‌ని.. అడుగుతున్నార‌ని.. అయితే ఇదంతా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చ‌ల‌వేన‌ని ఎన్‌టీఆర్ అన్నారు. ఈ మేర‌కు తారక్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now