Naresh : చివ‌ర‌కు ఆ విధంగా చేయాల‌ని డిసైడ్ అయిన న‌రేష్, ప‌విత్రా లోకేష్‌..?

July 10, 2022 2:08 PM

Naresh : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, న‌టి ప‌విత్రా లోకేష్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రువు కాస్తా పోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వీరంటే అంద‌రికీ గౌరవం ఉండేది. న‌రేష్ మా అసోసియేష‌న్‌లో అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఇప్పుడు మంచు విష్ణుకు వెన్నుద‌న్నుగా ఉన్నారు. అలాగే అనేక సినిమాల్లోనూ న‌టిస్తూ గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానంలో ఉన్నారు. కానీ ఈ మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో న‌రేష్ త‌న పేరు మొత్తం పోగొట్టుకున్నారు. ఆయ‌న‌తో క‌ల‌సి తిరిగేందుకు కూడా మా మెంబ‌ర్లు ఎవ‌రూ ఇష్టంగా లేర‌ని స‌మాచారం.

ఇక ప‌విత్ర లోకేష్ విష‌యానికి వ‌స్తే.. ఆమె సినిమాల్లో ఎక్కువ‌గా తల్లి పాత్ర‌ల్లో న‌టిస్తూ అస‌లైన మాతృమూర్తిలా అనిపించేది. కానీ ఈ వ్య‌వ‌హారం మొత్తం జ‌రిగాక ఆమె కూడా త‌న‌పై ఉన్న గౌర‌వం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్ప‌టికే రెండు సినిమాల్లో నుంచి ఆమెను తీసేశారు. ఇలా న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌లు ఇద్ద‌రూ మీడియాకెక్కి ర‌చ్చ ర‌చ్చ చేశారు. అయితే వీరు ఫైన‌ల్‌గా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై ఏ మీడియా సంస్థకు కూడా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అలా చేస్తే ఉన్న ఆ కాస్త ప‌రువు కూడా పోతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. క‌నుక మీడియాతో ఇక‌పై మాట్లాడొద్ద‌ని.. ఆ సంస్థ‌లకు దూరంగా ఉండాల‌ని వీరు డిసైడ్ అయ్యార‌ట‌.

Naresh and Pavitra Lokesh decided to keep away from media
Naresh

ఇక న‌రేష్ త‌న భార్య ర‌మ్య‌పై చ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేసేందుకు డిసైడ్ అయ్యార‌ట‌. ఆమెతో తెగ‌దెంపులు చేసుకోవ‌డ‌మే కాకుండా.. పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకుని వీలైనంత త్వ‌ర‌గా ఈ వివాదాల‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. క‌నుక త్వ‌ర‌లోనే వీరి వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని అంటున్నారు. అయితే ర‌మ్య ర‌ఘుప‌తి మాత్రం న‌రేష్‌కు విడాకులు ఇవ్వ‌బోన‌ని.. త‌న భ‌ర్త‌తో క‌ల‌సి ఉండేందుకు ఇప్ప‌టికీ తాను సిద్ధ‌మేన‌ని.. త‌న‌ను, న‌రేష్‌ను ప‌విత్ర క‌ల‌వ‌నీయ‌కుండా అడ్డుకుంటుంద‌ని ఆరోప‌ణ‌లు చేసింది. మ‌రి వీరి క‌థ చివ‌ర‌కు ఎలా ముగుస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now