Nara Brahmani : నారా బ్రాహ్మణి తండ్రి కోసం ఎంత మంచి పని చేస్తుందో తెలుసా.. నిజంగా గ్రేట్..!

October 9, 2022 7:15 PM

Nara Brahmani : నట సింహం నందమూరి బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్వి గురించి తెలిసిందే.. వీళ్ళు ఈ జనరేషన్ కి సంబంధించిన అమ్మాయిలే అయినప్పటికీ సంస్కృతి సంప్రదాయాలను చక్కగా ఫాలో అవుతారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని బయట ఎక్కువ కనిపించదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. కానీ నారా బ్రాహ్మణి అలా కాదు.. సమాజం కోసం, పేదవారి కోసం తన వంతు కృషి చేస్తూ అటు నందమూరి ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ పరువు నిలబెడుతుంది. తన సాధించిన విజయాలు అనేకం ఉన్నా కానీ ఏనాడు మీడియా ముందుకు వచ్చి సినిమాల గురించి, తండ్రి గురించి పెద్దగా మాట్లాడదు.

బ్రహ్మణికి వాళ్ల నాన్నగారు బాలకృష్ణ అంటే చాలా గౌరవం.. ఇష్టం.. అలాగే భయం కూడా.. కాగా నారా బ్రాహ్మణి ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న గారి పుట్టినరోజున 1000 మందికి పైగా అనాథలకు అన్నదానం చేస్తుందట. అయితే ఈ విషయం మాత్రం బయటకు చెప్పుకోదట బ్రాహ్మణి. ఎందుకంటే పాపులారిటీ కాదు ఆమెకు కావాల్సింది నలుగురికి అన్నం పెట్టాను.. వాళ్ళ ఆకలి తీర్చాను అన్న సంతృప్తి చాలు నాకు అంటూ నారా బ్రాహ్మణి చెప్పుకొస్తుందట. ఇప్పటికీ ఆ అలవాటును కొనసాగిస్తోంది.

Nara Brahmani doing great work for balakrishna
Nara Brahmani

నారా బ్రాహ్మణికి కాలేజీ రోజుల్లో చదువుకునే టైంలో నుంచే ఈ అలవాటు ఉందట. మొదట 10 మందికి తన దగ్గర ఉన్న డబ్బుల్ని సహాయం చేసేదట. ఇక తర్వాత తన సంపాదన పెరిగే కొద్దీ తండ్రి పేరు చెప్పి వీలైనంత మందికి భోజనం పెట్టేదట. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా బ్రాహ్మణి 1000 మందికి పైగా అనాథలకు అన్నదానం చేసిందట. కానీ ఆ విషయం మాత్రం బయటకు చెప్పుకోలేదట. చిన్న సహాయం చేస్తేనే సోషల్ మీడియా డబ్బా కొట్టుకునే సెలబ్రిటీలు ఉన్న ఈ రోజుల్లో.. నారా బ్రాహ్మణి ఇలా సింపుల్ గా ఉండడం గ్రేట్ కదా..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now