Nara Bhuvaneshwari : నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు..!

November 26, 2021 9:20 PM

Nara Bhuvaneshwari : గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారింది. ఇక కొందరు టీడీపీ అభిమానులు, నందమూరి హీరోలు ఈ విషయంపై స్పందించారు.

Nara Bhuvaneshwari said that insult never be felt by anyone

తాజాగా అసెంబ్లీ ఘటనపై చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొందరు తనని ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా భావించి తనకు మద్దతుగా నిలబడ్డారని.. ఇలా తనకు మద్దతుగా నిలబడిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనను విలువలతో కూడిన క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అలాంటి విలువలనే పాటిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కానీ ఈ విధంగా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ వారి గౌరవాన్ని కించపరచకూడదు. నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు.. భువనేశ్వరి బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now