Nani : బాల‌య్య షోతో నాని మ‌ళ్లీ వివాదంలో ఇరుక్కోనున్నాడా..!

November 9, 2021 8:42 AM

Nani : వెండితెర‌పై ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన బాల‌య్య ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాడు. అన్‌స్టాప‌బుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ అతిథులుగా వచ్చి షో రక్తి కట్టించారు. ఇక రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురి పేర్లు వినిపించగా చివ‌ర‌కు నాని రెండో ఎపిసోడ్ కు గెస్ట్‌గా వ‌చ్చారు. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

Nani may face trouble yet again for his talk show with balakrishna

ఇందులో నానిని గ‌ల్లీ క్రికెట్ ఆడ‌తావా అని అడిగాడు బాల‌య్య‌. అందుకు అవును అని అన్నాడు. తాను సెట్‌లో క్రికెట్ ఆడుతానంటూ బాల‌య్య చెప్పాడు. క్రికెట్ కిట్ త‌న కారులో త‌ప్ప‌క ఉంటుంద‌ని చెప్పిన బాల‌య్య గార్డ్‌ కూడా ఉంటుంద‌ని చెప్పి న‌వ్వించాడు. ఇక ఏదో విష‌యంలో పులిహోర క‌ల‌ప‌కు అంటూ నానిని ఉద్దేశించి అంటాడు బాల‌య్య‌. ప్రోమో చూస్తుంటే ఇది కూడా మంచి ఎంట‌ర్‌టైన్ అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ట‌క్ జ‌గ‌దీష్ వివాదం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసినంద‌కు నానిపై డిస్ట్రిబ్యూట‌ర్స్ మండిప‌డ్డారు. ఈ విష‌యంపై ఏదో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. దీని వ‌ల‌న నాని మ‌ళ్లీ వివాదంలో ఇరుక్కుంటాడా అని ముచ్చ‌టించుకుంటున్నారు.

నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. ఇందులో అత‌ని చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా ఉంది. రెండో ఎపిసోడ్‌లో బాల‌య్య‌తో నాని సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. నాని సినిమాల విషయానికి వస్తే చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. తాజాగా నాని న‌టించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now