Nani : ద‌స‌రా పండుగ రోజు అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వ‌బోతున్న నాని..!

October 13, 2021 9:45 PM

Nani : నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తూ ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య నానికి ల‌క్ స‌రిగ్గా క‌లిసి రాక ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. ఇటీవల ‘టక్ జగదీష్’ అనే ఫామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు నాని. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల కాగా అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. దీంతో త‌న త‌దుప‌రి సినిమాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నాడు.

Nani giving update about his film on dasara

నాని ప్ర‌స్తుతం శ్యామ సింగ రాయ్ అనే చిత్రం చేస్తున్నాడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అలానే నాని.. అంటే.. సుందరానికి అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత #Nani29 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తాజాగా తన 29వ సినిమాకి సంబంధించిన దానిపై నాని ఒక అప్‌డేట్‌ ను ఇచ్చారు. అక్టోబర్ 15 వ తేదీన 1:53 గంటలకు సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బ్లాక్ థీమ్ లో ఓ పొగ రైలును ఇందులో చూడొచ్చు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది అని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now