Nani : నాకు కిరాణా కొట్టు ఉండేది.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారికి స‌మాధానం ఇచ్చిన నాని..

December 30, 2021 9:08 AM

నేచురల్‌ స్టార్‌ నాని తాను న‌టించిన శ్యామ్ సింగ రాయ్ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా కిరాణ కొట్టుకి సంబంధించి కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ.. అంటూ నాని తన అభిప్రాయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. నాని చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు త‌మ‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Nani said he had grocery store once

అయితే ఈ ‘కిరాణా కొట్టు’ కామెంట్స్‌పై నాని తొలిసారిగా స్పందించారు. తనకి కిరాణా కొట్టుకి కనెక్షన్ ఉందని చెప్పిన ఆయన తాను ఎవర్నీ కించపరిచి మాట్లాడలేదన్నారు. నేను చేసిన కామెంట్లపై స్పందించడానికి నేనేం పెద్ద ఇబ్బంది పడటం లేదు. నేను మాట్లాడింది కొంతే.. దాంట్లో చిన్న పదాన్ని పట్టుకుని దాన్ని తిప్పి తిప్పి కొట్టి.. ఆ పదానికి డిఫరెంట్ థంబ్ నెయిల్స్ పెట్టి.. ఆ వర్డ్‌ని తీసుకుని వెళ్లి వేరేవాళ్ల దగ్గర చెప్పి.. వాళ్ల రియాక్షన్ తీసుకుని వాళ్లతో నన్ను ఏదోటి అనిపించారు.

చాలామందికి అర్ధం కాని విషయం ఏంటంటే.. అమీర్ పేట ఇమేజ్ హాస్పిటల్‌ పక్కన ఉన్న కిరాణా షాపు లాంటి ఎస్టీడీ కెఫే మా నాన్నగారికి ఉండేది. హాస్పిటల్‌ లో ఉండే పేషెంట్స్ కోసం ఆ చిన్న షెటర్‌లో కేఫ్ పెట్టారు. నేను కాలేజ్ అయిన తరువాత వెళ్లి కౌంటర్‌లో కూర్చునే వాడిని. నాపై కామెంట్లు చేస్తున్నవాళ్లెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే.. కిరాణా కొట్టుతో నాకు కనెక్షన్ ఉంది. నేను అడిగింది ఏంటంటే.. అంతమందికి ఉద్యోగాలు లేకపోతే థియేటర్స్‌ వాళ్లు ఎలా బతుకుతారని, కానీ దానిని వేరేలా ప్రొజెక్ట్ చేశారని నాని పేర్కొన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now