Nani : గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా క‌నిపిస్తున్న నాని.. ద‌స‌రా నిరుడు లెక్క ఉండ‌దంటున్నాడు..!

October 16, 2021 9:54 AM

Nani : చూడ‌డానికి ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే నాని త‌న ప్ర‌తి సినిమాతో అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు. అయితే ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఒక‌వైపు ఆయ‌న సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు, మ‌రోవైపు చిత్రాలు స‌రైన సక్సెస్‌లు సాధించ‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Nani dasra movie poster thrilling look

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లలో రెండు సినిమాలను విడుదల చేసిన నాని.. శ్యామ్ సింగ రాయ్ అంటూ థియేటర్లలో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. దాని తరువాత మరో ప్రాజెక్ట్‌ను రెడీ చేశాడు. అంటే సుందరానికీ ! ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇది వరకే వచ్చింది. వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త థ్రిల్‌ని అందించ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

తాజాగా నాని 29వ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. ద‌స‌రా అనే టైటిల్‌తో నాని 29వ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించ‌నున్నాడు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. పోస్ట‌ర్‌లో రగ్డ్ లుక్‌తో ఉన్న నాని క‌నిపిస్తుండ‌గా, ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. పోస్ట‌ర్ చూస్తుంటే నాని ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు.  మ‌రి ఈ మూవీతో అయినా నాని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now