Nagarjuna : అవ‌న్నీ పుకార్లే.. ద‌య‌చేసి నిజాలు రాయండి.. మీడియాను వేడుకున్న నాగార్జున‌..!

January 27, 2022 7:19 PM

Nagarjuna : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. వారిద్ద‌రూ విడాకులు తీసుకునేందుకు కార‌ణాలు ఇవే.. అంటూ చాలా మంది ర‌క ర‌కాల వార్త‌ల‌ను ప్ర‌చారం చేశారు. అయితే ఇప్ప‌టికీ అలాంటి వార్త‌లు ప్ర‌చారం అవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా నాగార్జున మాట్లాడిన‌ట్లుగా చెబుతున్న కొన్ని వార్త‌లు మ‌ళ్లీ వైర‌ల్ అయ్యాయి.

Nagarjuna rubbished news on samantha and naga chaitanya divorce

అయితే తాను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. ఓ బాలీవుడ్ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చానంటూ కొన్ని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయ‌ని.. వాటిల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని.. ద‌య‌చేసి మీడియా సంస్థ‌లు నిజానిజాలు తెలుసుకుని వార్త‌లు రాయాలి.. అంటూ నాగార్జున కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

స‌మంతే నాగ‌చైత‌న్య‌ను ముందుగా విడాకులు అడిగింద‌ని.. అందుకు నాగ‌చైత‌న్య ఒప్పుకున్నాడ‌ని.. అయితే త‌న తండ్రి ఏమైనా అనుకుంటారేమోన‌ని, కుటుంబ గౌర‌వం, ప్ర‌తిష్ట ఏమ‌వుతుందోన‌ని త‌న తండ్రి ఫీల‌వుతార‌ని చెప్పి నాగ‌చైత‌న్య ఆలోచించాడ‌ని.. నాగార్జున చెప్పిన‌ట్లు కొన్ని వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. కానీ అవ‌న్నీ పుకార్లే అని నాగార్జున కొట్టి పారేశారు. తాను ఆ మాటల‌ను ఎక్క‌డా మాట్లాడ‌లేద‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now