Nagarjuna : నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకులు.. తొలిసారిగా స్పందించిన నాగార్జున‌.. ఏమ‌న్నారంటే..?

January 25, 2022 11:45 AM

Nagarjuna : టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా ఉన్న స‌మంత, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకోవ‌డం సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ వ్య‌క్తం చేశారు. అయితే ఈ సంగ‌తి అలా ఉంచితే కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్‌, వెబ్‌సైట్లు ఈ విష‌యంలో కాస్త హ‌ద్దు మీరి ప్ర‌వ‌ర్తించిన‌ట్లు అర్థ‌మైంది. ఈ క్ర‌మంలోనే స‌మంత వారిపై కోర్టు వ‌ర‌కు వెళ్లి క్ష‌మాప‌ణ‌లు చెప్పేలా చేసింది.

Nagarjuna responded for the first time on naga chaitanya and samantha divorce

అయితే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల విష‌య‌మై నాగార్జున ఎప్పుడూ స్పందించ‌లేదు. కానీ తాజాగా ఆయ‌న ఓ ఆంగ్ల మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై ఎట్ట‌కేల‌కు స్పందించారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల విష‌య‌మై ఆయ‌న తొలిసారిగా మాట్లాడారు.

కావాలనే కొందరు పనిగట్టుకొని చెత్త రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నేను పట్టించుకోను.. అని నాగార్జున అన్నారు.

అయితే స‌మంత‌, చైత‌న్య ఇద్ద‌రూ విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌గానే అనేక పుకార్లు షికార్లు చేశాయి. స‌మంత‌కు పిల్ల‌ల‌ను క‌న‌డం న‌చ్చ లేద‌ని, ఆమె స్కిన్ షోకు అక్కినేని ఫ్యామిలీ అభ్యంత‌రం చెబుతుందని, ఆమె అబార్ష‌న్ చేయించుకుంద‌ని.. ర‌క‌ర‌కాల వార్త‌ల‌ను ప్ర‌చారం చేశారు. వాట‌న్నింటికీ స‌మంత చెక్ పెట్టేసింది. అయిన‌ప్ప‌టికీ స‌మంత‌ను ఇప్ప‌టికీ కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శిస్తూనే ఉన్నారు.

కాగా నాగార్జున‌, నాగ‌చైత‌న్య న‌టించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. ఈ మూవీలో చైతూ స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి న‌టించి మెప్పించింది. త్వ‌ర‌లో చైత‌న్య లాల్ సింగ్ చ‌డ్డా అనే హిందీ మూవీలో క‌నిపించ‌నున్నాడు. ఇక స‌మంత య‌శోద‌, శాకుంతలం, కాతువాకుల రెండు కాద‌ల్ అనే మూవీల్లో క‌నిపించ‌నుంది. ఇటీవ‌లే ఆమె పుష్ప లో ఐట‌మ్ సాంగ్ చేసి అల‌రించింది. అలాగే త్వ‌ర‌లో లైగ‌ర్ మూవీలోనూ సామ్ ఐట‌మ్ సాంగ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now