Nagarjuna : ఆ హీరోయిన్ కెరీర్ ను నాశ‌నం చేసిన నాగార్జున..? ఇప్పుడు మ‌ళ్లీ ఆమెను ఆదుకుంటున్నాడా..?

August 29, 2022 6:25 PM

Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మరోవైపు తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను అన్న అక్కినేని వెంకట్ తో కలిసి చూసుకుంటున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆ సంస్థ నుంచి ఎప్పుడూ కొత్త టాలెంట్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయంలో నాగార్జున ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటాడు. ఫేడ్ అవుట్ అవుతున్న రమ్యకృష్ణ లాంటి వారికి అవకాశం ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి తెచ్చాడు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాల్లో నాగ్ తన హిట్ పెయిర్ అయిన రమ్యకృష్ణను ఎంచుకున్న సంగతి తెలిసిందే.

నాగార్జున సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నవారే తప్ప.. దెబ్బైపోయిన వాళ్ళు చాలా తక్కువ. కానీ దెబ్బైపోయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రకుల్‌కి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. బిజీ హీరోయిన్‌గా ఉన్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలో ఛాన్స్ వస్తే డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అలాంటి రకుల్ ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఏ హీరో పిలిచి తన సరసన ఛాన్స్ ఇస్తాడా.. అని పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తోందట.

Nagarjuna reportedly will do a movie with Rakul Preet Singh
Nagarjuna

ఇటీవల ఎక్కువగా గీతా ఆర్ట్స్ వారితో టచ్‌లో ఉంటుందని టాక్. అంతేకాదు, అల్లు అర్జున్ కి మెసేజ్‌లు పెడుతుందని చెప్పుకుంటున్నారు. తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని కూడా ఇన్‌డైరెక్ట్‌గా కోరిందని సమాచారం. ఇదిలా ఉండ‌గా నాగార్జున మళ్ళీ రకుల్‌ని పిలిచినట్టు తెలుస్తోంది. ఇంతకముందు నాగార్జున సరసన రకుల్ మన్మథుడు 2లో హీరోయిన్‌గా నటించింది. రకుల్‌ టాలీవుడ్‌లో కెరీర్ దెబ్బతినడానికి ఈ సినిమా కారణమని చెప్పొచ్చు. ఆ సినిమాలో ముస‌లి వ‌య‌స్సులో ఉన్న నాగ్‌తో లిప్ లాక్ ఇవ్వ‌డాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక‌పోయారు.

ఇటీవల క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలంలో హీరోయిన్ గా చేసింది రకుల్. ఇందులో రకుల్ డీగ్లామర్ గా కనిపించింది. ఇది కూడా రకుల్ కెరీర్ లో ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఆ త‌ర్వాత ఆమెతో చేసేందుకు కుర్ర హీరోలు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే తన వల్ల కెరీర్ దెబ్బైపోయింది కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చి రకుల్‌ను ఆదుకోవాలనుకుంటున్నారట నాగార్జున. మరి అది ఏ సినిమానో తెలియదు గానీ, రకుల్ మాత్రం మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఫిట్ నెస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే రకుల్ కి మళ్లీ అవకాశం వస్తే హిట్ ట్రాక్ లో పడుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now