Vennela Kishore : నా కోడలు పిల్లకి దూరంగా ఉండు అంటూ వెన్నెల కిషోర్ కి నాగ్ సీరియస్ వార్నింగ్..?

October 7, 2022 9:12 AM

Vennela Kishore : వచ్చీ రాగానే ఆకట్టుకున్నవారు.. తమ తొలి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చేసుకుంటూ ఉంటారు. అలా చిత్రసీమలో ఎందరో నటీనటులు అప్పట్లో వెలుగులు విరజిమ్మారు. ప్రస్తుతం అలా సాగుతున్న వారిలో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా ఉన్నాడు. తొలి చిత్రం వెన్నెలతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన కిశోర్ ఆపై వెన్నెల కిశోర్ గా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో నవ్వుల వెన్నెల కురిపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు కిశోర్.

అయితే ఎప్పుడు ఎవరినీ మాటలతో హర్ట్ చేయని వెన్నెల కిషోర్.. మొదటిసారి తన కారణంగా బాధపడిన హీరోయిన్ వలన నాగార్జున చేత తిట్టించుకున్నాడట. నాగ్, కిషోర్ కాంబోలో లాస్ట్ గా వచ్చిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి, వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే ఆ చనువుతో షూటింగ్ స్పాట్లో వెన్నెల కిషోర్ కృతి శెట్టిపై సరదాగా కొన్ని జోక్స్ వేశాడట.

Nagarjuna reportedly given warning to Vennela Kishore
Vennela Kishore

దీంతో హర్ట్ అయిన కృతి ఈ విషయం నాగార్జునకి చెప్పి బాధపడిందంట. కిషోర్ ని పిలిచి నాగార్జున అర్థ‌మయ్యే విధంగా చెప్పారట. ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చిన అమ్మాయి.. అలాంటి జోక్స్ తీసుకోలేదు. అయినా అమ్మాయిలపై అలాంటి జోక్స్ ఏంటయ్యా ఇంకోసారి ఇలాంటి జోక్స్ చేసావంటే రెమ్యూనరేషన్ కట్ చేయించేస్తాను. నా కోడలు పిల్లకు దూరంగా ఉండు అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో అప్పటికప్పుడే వెన్నెల కిషోర్ కృతికి సారీ చెప్పాడట. బంగార్రాజు సినిమాలో కృతి.. నాగ చైతన్యను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా నటించిన విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now