Ghost Movie : నాగార్జున ఘోస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌..?

July 9, 2022 2:43 PM

Ghost Movie : సీనియ‌ర్ హీరోలు అంద‌రూ ఇప్పుడు సినిమాలు హిట్ కావాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కానీ ఏం చేసినా స‌రే వారి సినిమాలు మాత్రం హిట్‌ను సాధించ‌లేక‌పోతున్నాయి. ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈమ‌ధ్యే ఆయ‌న న‌టించిన బంగార్రాజు మూవీ వ‌చ్చింది. ఇది హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇది ఆయ‌న పూర్తి స్థాయి చిత్రం కాదు. ఇందులో నాగ‌చైత‌న్య‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. క‌నుక ఈ మూవీ చైతూ ఖాతాలోనే ప‌డింది.

ఇక ఆయ‌న న‌టించిన మ‌న్మ‌థుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు అయితే అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలోనే నాగార్జున మ‌రోమారు ది ఘోస్ట్ పేరిట మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. దీనికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ షూటింగ్‌ను అయితే ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. టీజ‌ర్ కూడా లాంచ్ కానుంది. ఇక చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని భావిస్తోంది. అయితే ఈ మూవీకి ఎలాంటి బ‌జ్ లేదు. ప్రేక్ష‌కుల్లో అంత ఆస‌క్తి కూడా లేదు. ఆయ‌న గ‌త చిత్రం వైల్డ్ డాగ్ లాగే ది ఘోస్ట్ కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమాకు ఎలాంటి బ‌జ్ లేక‌పోవ‌డంపై నిర్మాతలు ఆందోళ‌న చెందుతున్నారు.

Nagarjuna Ghost Movie may release on OTT directly
Ghost Movie

అయితే ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా నాగ్ ది ఘోస్ట్ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కానీ ముందుగా చిత్రంపై కాస్త బ‌జ్ పెంచుతార‌ని తెలుస్తోంది. దీంతో కాస్త ఎక్కువ ధ‌ర‌కే ఓటీటీ సంస్థ‌లు ఈ మూవీని కొనేందుకు ఆస‌క్తిని చూపిస్తాయి. అందులో భాగంగానే అమెజాన్‌, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు. అస‌లే ప‌రిస్థితులు బాగా లేవు. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి న‌ష్టాల‌ను ఎందుకు చ‌విచూడాలి.. అనుకుంటున్నారో ఏమో.. ఘోస్ట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment