గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న నాగ‌బాబు లేటెస్ట్ పోస్ట్‌.. ఎవ‌రిని ఉద్దేశించి అన్నార‌బ్బా..?

August 7, 2022 4:03 PM

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటులలో నాగబాబు కూడా ఒకరు అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అటు రాజకీయాల్లోనూ, ఇటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు నాగబాబు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు.

జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఎదుటి వారు చేసే కామెంట్లకు సోషల్ మీడియాలో తన‌దైన శైలిలో కౌంటర్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలో ఏర్పాట్లను పరిశీలిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జనసేన పార్టీ గెలవడానికి కావ‌ల్సిన కసరత్తులు మొదలుపెట్టారు నాగబాబు.

nagababu latest post creating confusion

అయితే ఇప్పుడు అదే విధంగా నాగబాబు చేసిన ఒక పోస్ట్ నెటిజన్లు చూపులను ఆకర్షించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఏమంటారు బాయ్స్ అంటూ ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన మెసేజ్ పోస్ట్ చేశారు నాగబాబు. ఆ మెసేజ్ ఏంటంటే.. మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు.. అంటూ ఒక స్మార్ట్ లుక్ ఇమేజ్ తో ట్వీట్ పోస్ట్ చేశారు.

అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఇలాగ పోస్ట్ చేశారు అనే విషయంపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటూ ఒకరు.. ఏంటి సార్ ఈ కొత్త లుక్ వెనుక ఉన్న ఆంతర్యం.. అంటూ మరొకరు, ఇన్ డైరెక్ట్ గా ఎవరి గురించి చెబుతున్నారు సార్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి గురించి నాగబాబు ఇలా కామెంట్ చేస్తూ ఎందుకు ట్వీట్ చేశారు.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now