Nagababu in Jabardasth : మెగా బ్ర‌ద‌ర్ మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్త్ వైపు అడుగులు వేయ‌బోతున్నారా..!

October 13, 2021 10:54 PM

Nagababu in Jabardasth : ప్రముఖ టెలివిజన్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్థస్త్. ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కామెడీ షోని మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో స్కిట్స్ ని వేస్తూ తమ టైమింగ్స్, కామెడీతో ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ కామెడీ షోకి మొదటి నుండి మెగా బ్రదర్ నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉండేవారు. కానీ పలు కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి పక్కకు వచ్చేశారు.

Nagababu in Jabardasth he may continue in the show soon

ఆ తర్వాత మరో ఛానెల్ లో అదిరింది అనే ప్రోగ్రామ్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ని గత కొన్ని రోజులుగా నిలిపివేశారు. ఈ క్రమంలో నాగబాబు మళ్ళీ జబర్థస్త్ లోకి రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జబర్థస్త్ లో కామెడీ చేసేవారు నాగబాబు దగ్గరకు వెళ్ళి జబర్దస్త్ కి రావాలని కోరితే తనకు రావడంలో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, ఈటీవీ, మల్లెమాల సంస్థలు ఒప్పుకుంటే జబర్థస్త్ షోకి వస్తానని అన్నారు.

తాను బయటకు వచ్చేటప్పుడు కొన్ని గొడవలు అయ్యాయని, ఇప్పు అవి సాల్వ్ అయ్యాయని, తనకు మళ్ళీ జబర్థస్త్ లోకి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదనన్నారు. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత సింగర్ మనో ఆ ప్లేస్ ని రీప్లెస్ చేశారు. మరి ఇప్పుడు నాగబాబు ఎంట్రీ ఇస్తే మనో వెళ్ళిపోవాల్సిందేనా.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మెగా బ్రదర్ నాగబాబు జబర్థస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తే ఈ షోకి క్రేజ్ తోపాటు రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతుందని.. నెటిజన్లు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now