Nagababu : తెలుగు సినిమాల‌ను ఏపీలో బ్యాన్ చేయండి.. నాగ‌బాబు ఘాటు వ్యాఖ్య‌లు..

February 28, 2022 3:58 PM

Nagababu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై యుద్ధం ఇంకా ముగియ‌లేదు. ఏపీ మంత్రులు వ‌ర్సెస్ ప‌వ‌న్ అన్న‌ట్లు ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మ‌రో మారు మారిపోయాయి. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు వ‌రుస వీడియోల‌ను రిలీజ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్‌ను తొక్కేయ‌డానికే ఆయ‌న సినిమా భీమ్లా నాయ‌క్‌ను అడ్డుకుంటున్నార‌ని.. ఆయ‌న తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇక మ‌ళ్లీ ఆయ‌న మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో నాన్చుడు ధోర‌ణిని అవ‌లంబిస్తుంద‌ని.. ఇది స‌రికాద‌ని.. త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని.. కొత్త జీవోను త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న యూట్యూబ్ చానల్‌లో మ‌ళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Nagababu asked to ban Telugu movies in Andhra Pradesh
Nagababu

ఈ మ‌ధ్య కాలంలో కోవిడ్ ప్ర‌భావం త‌గ్గ‌డంతో ఏపీలో థియేట‌ర్ల‌లో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి చేశారు. థియేట‌ర్ల‌లో ఉన్న నిబంధ‌న‌ల‌ను ఎత్తేశారు. కానీ టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలోనే ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఆ మ‌ధ్య చిరంజీవి ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో వెళ్లి సీఎం జగ‌న్‌ను క‌లిశాక ఒక వారం, ప‌ది రోజుల్లో కొత్త జీవో వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే తాజాగా విడుద‌లైన ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాకు క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. అందుక‌నే నాగ‌బాబు స్పందించారు.

టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో ఇంకా కొత్త జీవోను ఎందుకు విడుద‌ల చేయ‌లేద‌ని నాగబాబు ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అలాగే విడుద‌ల చేస్తే జీవోను విడుద‌ల చేయండి.. లేదంటే ఏపీలో తెలుగు సినిమాల‌ను బ్యాన్ చేయండి.. అంటూ నాగ‌బాబు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మంత్రుల‌కు సినిమా అంటే ఏమిటో తెలియ‌ద‌ని.. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి సినిమాను తీయాల‌ని అన్నారు. తెలుగు సినిమాలు ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయాన‌ని.. ఇక‌నైనా ప్ర‌భుత్వం స్పందించాల‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now