Naga Shaurya : ఆ హీరోయిన్ ను చూస్తే అలా చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య కామెంట్స్..

December 3, 2021 3:19 PM

Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగశౌర్య, కేతికశర్మ జంటగా నటించిన లక్ష్య సినిమా డిసెంబర్ 10వ తేదీన‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రం ద్వారా పరిచయమైన కేతికశర్మ లక్ష్య సినిమాలో నాగసౌర్య సరసన నటించింది.

Naga Shaurya comments viral on ketika sharma

ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన‌ విడుదల కానుండడంతో ఈ సినిమా ట్రైలర్ వేడుకల్లో భాగంగా నాగశౌర్య హీరోయిన్ కేతికశర్మ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ కేతికశర్మను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంద‌ని అన్నాడు. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ పాత్రలో నటించింద‌ని తెలిపాడు.

కాగా రొమాంటిక్ బ్యూటీ కేతికశర్మ గురించి నాగ శౌర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక యూత్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కేతిక.. వైష్ణవ్ తేజ్ తో కలిసి మరొక సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా వరుడు కావలెను చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ప్రస్తుతం లక్ష్య సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now