Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత ఈ బాధ నుంచి బయట పడటం కోసం తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నప్పటికీ, నాగచైతన్య మాత్రం తన తదుపరి సినిమా పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య బంగార్రాజు, థాంక్యూ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.
ఇక ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత పలువురు స్టార్ హీరో హీరోయిన్లు ఒక వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నాగచైతన్య కూడా సమంతా బాటలోనే పయనిస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే నాగచైతన్య కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒక వెబ్ సిరీస్ లో చైతన్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగచైతన్య విలన్ పాత్ర పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. హార్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి సమంత మాదిరిగానే చైతన్య కూడా వెబ్ సిరీస్‌లలో విజయం సాధిస్తాడా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…