గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Naga Chaithanya : ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న చైతూ.. సక్సెస్ అవుతాడా ?

Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత ఈ బాధ నుంచి బయట పడటం…

Naga Chaithanya : ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న చైతూ.. సక్సెస్ అవుతాడా ?

Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత ఈ బాధ నుంచి బయట పడటం కోసం తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నప్పటికీ, నాగచైతన్య మాత్రం తన తదుపరి సినిమా పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య బంగార్రాజు, థాంక్యూ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

Naga Chaithanya may act in web series in amazon prime

ఇక ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత పలువురు స్టార్ హీరో హీరోయిన్లు ఒక వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నాగచైతన్య కూడా సమంతా బాటలోనే పయనిస్తున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే నాగచైతన్య కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒక వెబ్ సిరీస్ లో చైతన్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగచైతన్య విలన్ పాత్ర పోషిస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. హార్రర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి సమంత మాదిరిగానే చైతన్య కూడా వెబ్‌ సిరీస్‌లలో విజయం సాధిస్తాడా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి