Bangarraju Movie : బంగార్రాజు ట్రైల‌ర్‌లో ఓ సీన్‌లో కనిపించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

January 11, 2022 8:09 PM

Bangarraju Movie : అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా.. ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీకి చెందిన ట్రైల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఈ మూవీ మంచి రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

Bangarraju Movie  do you know about this actress appeared in one scene

ఇక ఈ సినిమా ట్రైల‌ర్ తొలి సీన్‌లోనే స్వ‌ర్గంలో ఓ దేవ‌క‌న్య నాగార్జున ఉద్దేశించి మాట్లాడుతూ.. బంగార్రాజు బావ‌గారు చూపుల‌తోనే ఊచ‌కోత కోస్తున్నారు.. అంటుంది. అయితే ఆమె ఎవ‌రు అని ఇప్పుడు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వెదుకుతున్నారు. కానీ ఆమెకు ఈ సినిమా మొద‌టిది కాదు, ఇది వ‌ర‌కే ఆమె సినిమాల్లో న‌టించింది. కానీ ఎవ‌రూ ఆమెను గుర్తు ప‌ట్ట‌లేదు.

బావ‌గారు చూపుల‌తోనే ఉచ‌కోత కోస్తున్నారు.. అనే డైలాగ్‌ను చెప్పిన ఆ న‌టి పేరు మీనాక్షి దీక్షిత్‌. ఈమె 2009లో వ‌చ్చిన జీవ‌న‌శైలి అనే మూవీతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ దూకుడు సినిమాలో టైటిల్ సాంగ్‌లో న‌టించింది. త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ వంటి భాష‌ల‌కు చెందిన మూవీల్లోనూ ఈమె న‌టించింది కానీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు బంగార్రాజు మూవీలో ఒక్క డైలాగ్‌తోనే ఆమె ఫేమ్ అయిపోయింది. ఆమె ఎవ‌రా ? అని ప్రేక్ష‌కులు తెగ ఆరాలు తీస్తున్నారు.

ఇక బంగార్రాజు మూవీలో రావు ర‌మేష్, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్ వంటి వారు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now