Naga Chaithanya : నాగ‌చైత‌న్య ఇంట్రెస్టింగ్ కామెంట్‌.. నా క‌ళ్ల‌లో ఇంకా అదే తిరుగుతుంద‌న్న చైతూ..!

October 9, 2021 10:22 AM

Naga Chaithanya : అఖిల్‌, పూజా హెగ్డెల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఈ మూవీని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించారు. త‌న తొలి చిత్రం బొమ్మ‌రిల్లు హిట్ కావ‌డంతో భాస్క‌ర్ కు ఆ చిత్రం పేరు ఇంటి పేరు అయింది. దీంతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అని పేరు మార్చుకున్నాడు. ఇక భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.

Naga Chaithanya made interesting comment on akhil

ఈ మూవీకి గాను శుక్ర‌వారం ప్రీ రిలీజ్ వేడుకను హైద‌రాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగ చైత‌న్య కూడా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా త‌న సోద‌రుడి చిత్రంపై నాగ‌చైత‌న్య మాట్లాడారు.

అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడ‌ని నాగ‌చైత‌న్య తెలిపారు. ఈ మూవీ అఖిల్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అఖిల్ చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా ఫ్యూచ‌ర్‌ను ప్లాన్ చేసుకుంటాడ‌ని అన్నారు. వ‌చ్చే 5-6 సంవ‌త్స‌రాల కాలంలో అఖిల్ ప‌క్కా ప్లానింగ్‌తో మూవీల విష‌యంలో ముందుకు సాగుతున్నాడ‌ని తెలిపారు.

అయితే అఖిల్ ఇంత‌టి పెద్ద‌వాడైనా త‌న క‌ళ్ల‌కు ఇంకా సిసింద్రీ లాగే క‌నిపిస్తాడ‌ని నాగ‌చైత‌న్య అన్నారు. సిసింద్రీలా ఉన్న‌ప్ప‌టి దృశ్యాలే త‌న క‌ళ్ల ముందు ఇంకా తిరుగుతున్నాయ‌ని అన్నారు. కాగా నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్రం వ‌సూళ్ల‌ను బాగానే రాబ‌డుతోంది. ఇప్ప‌టికీ సినిమాకు పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేశాయ‌ని, ఇక వ‌చ్చేదంతా లాభ‌మే అనే టాక్ న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now