Naga Chaithanya : స‌మంత ఫ్రెండ్‌తో సినిమా చేసే ఆలోచ‌న‌లో చైతూ.. సామ్‌ని వ‌ద్ద‌ని మ‌రో భామ‌ని క‌థానాయిక‌గా..

October 27, 2021 9:23 PM

Naga Chaithanya : వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా క‌నిపిస్తారు. ‘ఏమాయ చేసావే’తో మొదలైన వీరి ప్రయాణం ‘మనం’, ‘ఆటో నగర్‌ సూర్య’ సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత కూడా జంటగా నటించి హిట్లు కొట్టారు. ప‌దేళ్ల స్నేహం, మూడేళ్ల దాంప‌త్యం త‌ర్వాత ఈ ఇద్ద‌రూ అక్టోబ‌ర్ 2న విడాకులు ప్ర‌క‌టించారు.

Naga Chaithanya doing film with samanthas friend

విడాకుల త‌ర్వాత స‌మంత‌- నాగ చైత‌న్య సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ఇప్ప‌టికే ఈ జంట ప‌లు సినిమాల‌లో న‌టించి సంద‌డి చేయ‌గా, విడాకుల‌కి ముందు నందిని రెడ్డి దర్శకత్వంలో క‌లసి ఓ సినిమా చేయబోతున్న‌ట్టు వార్తలు వచ్చాయి. కానీ విడాకుల త‌ర్వాత సీన్ మారిపోయింది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ చేయ‌బోయే సినిమాలో క‌థానాయిక‌గా స‌మంత‌కు బ‌దులు మ‌రొక‌రిని తీసుకోబోతున్నార‌ట‌.

నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్, ఓబేబి అనే సినిమాలను చేసింది. అదేవిధంగా ఆహాలో సమంత నిర్వహించిన సామ్ జామ్ అనే టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. వీరిద్ద‌రికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే చైతూ వ‌ల‌న స‌మంత‌ని త‌న సినిమాలో తీసుకోలేక‌పోతుంద‌ట నందిని. ఈ సినిమా కాక‌పోయినా స‌మంత ఇత‌ర ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌రుస సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now