Thank You Movie : నాగ‌చైత‌న్య థాంక్ యూ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

August 2, 2022 9:42 PM

Thank You Movie : ల‌వ్ స్టోరీ, బంగార్రాజు మూవీల‌తో వ‌రుస హిట్స్ కొట్టిన నాగ‌చైత‌న్య‌.. థాంక్ యూ చిత్రంతో డీలా ప‌డిపోయాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరమైన డిజాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకుంది. మూవీ రిలీజ్ అయిన రెండో రోజే వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోయాయి. ఈ క్ర‌మంలోనే నాగ‌చైత‌న్య కెరీర్‌లో థాంక్ యూ మూవీ ఒక అట్ట‌ర్ ఫ్లాప్ డిజాస్ట‌ర్ చిత్రంగా నిలిచిపోయింది. ఇక మూవీ బాగుంటేనే 4 వారాల్లో ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. అదే ఫ్లాప్ అయితే ఇంకా త్వ‌ర‌గానే ఓటీటీల్లోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే థాంక్ యూ మూవీ కూడా చాలా త్వ‌ర‌గా ఓటీటీలోకి వ‌స్తోంది.

థాంక్ యూ మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఈ మూవీని 3 వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. మూవీ జూలై 22న రిలీజ్ అయింది. క‌నుక ఆగ‌స్టు 12వ తేదీన ఓటీటీలోకి వ‌స్తుంద‌ని తెలియ‌జేశారు. బ‌హుశా నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే ఇలా ఏ చిత్రానికి ఇంత‌లా అవ‌మానం జ‌ర‌గ‌లేదేమో. కానీ థాంక్ యూ ద్వారా ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నాడు.

Naga Chaitanya Thank You Movie to release on OTT on Amazon Prime
Thank You Movie

ఇక థాంక్ యూ మూవీలో చైతూకు జోడీగా రాశిఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు న‌టించారు. దీనికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే థియేట‌ర్ల‌లో ఫ్లాప్ అయిన ఈ మూవీ ఓటీటీలో అయినా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో.. లేదో.. చూడాలి. కాగా చైత‌న్య ఇదే నెల‌లో ఇంకో మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌నున్నాడు. ఈయ‌న న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా అనే హిందీ మూవీ ఇదే నెల‌లో రిలీజ్ కానుంది. హిందీలో చైతూకు ఇదే తొలి మూవీ. కాగా ఇందులో ఆయ‌న పాత్ర నిడివి 15 నిమిషాల పాటు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఇందులో చైత‌న్య ఎలా అల‌రిస్తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now