Naga Chaitanya : నాగ‌చైత‌న్య ఒక్క సినిమాకు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

July 17, 2022 9:30 AM

Naga Chaitanya : యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్నాడు. ఈయ‌న న‌టించిన గ‌త 4 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే చైతూ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. అయితే వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చైతూ సినిమా కెరీర్ కు మాత్రం ఎలాంటి ఢోకా లేద‌నే చెప్పాలి. యంగ్ హీరోల్లో చైత‌న్య‌కు ఉన్న స‌క్సెస్ రేట్ ప్ర‌స్తుతం ఏ హీరోకు లేద‌నే చెప్పాలి. ఇక సినిమాలు వ‌రుస‌గా హిట్ అవుతుండ‌డంతో చైత‌న్య ప్ర‌స్తుతం త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా బాగానే పెంచిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

చైత‌న్య.. మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. వీటిల్లో వెంకీ మామ ఒక మోస్త‌రుగా న‌డిచినా క‌లెక్ష‌న్ల‌ను బాగానే రాబ‌ట్టింది. ఇక మిగిలిన మూవీలు ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి. వీటిల్లో మ‌జిలీ, ల‌వ్ స్టోరీ సోలో చిత్రాలు కాగా.. వెంకీ మామ‌, బంగార్రాజు చిత్రాలు మ‌ల్టీ స్టార‌ర్ మూవీలు. ఈ క్ర‌మంలోనే చైతూ ఈ నాలుగు సినిమాలు అందించిన విజ‌యాల‌తో ఇప్పుడు స‌క్సెస్ జోష్ మీదున్నాడు. ఇక త్వ‌రలోనే థాంక్ యూ మూవీ ద్వారా మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Naga Chaitanya taking huge amount of remuneration for one movie
Naga Chaitanya

అయితే చైత‌న్య రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే.. మ‌జిలీ మూవీకి గాను ఆయ‌న రూ.6 కోట్ల మేర పారితోషికం అందుకున్నార‌ట‌. ఇక ఆ త‌రువాత చేసిన మూవీల‌కు కూడా రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల మ‌ధ్య‌లో రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దిల్ రాజు బ్యాన‌ర్‌పై విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన థాంక్ యూ సినిమాకి గాను చైతూ రూ.10 కోట్ల వర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా కేవ‌లం 2 ఏళ్ల వ్య‌వ‌ధిలోనే చైతూ రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ కావ‌డం విశేషం.

ఇక చైతూ న‌టించిన థాంక్ యూ మూవీ ఈ నెల 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కూడా హిట్ అవుతుంద‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now