నా జీవితంలో ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోలేను.. నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్..!

September 24, 2022 10:15 PM

అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. నాగ చైతన్య గత కొంతకాలంగా సినిమాల్లో వేగం పెంచాడు. అయితే కొంతకాలం క్రితం నాగ చైతన్యను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎప్పుడైతే సమంతతో లవ్ అంటూ పాపులర్ అయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈయన పేరు మారుమ్రోగిపోయింది.

అయితే వీళ్ళు విడాకులు ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తుంది. అయినా కానీ వీళ్ళపై అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా వుండగా తాజాగా నాగచైతన్య చేసిన ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది. నాగచైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లవ్ స్టోరీ మూవీ రిలీజై నేటికి ఏడాది కావస్తుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ టైంలో మెమోరీస్ ని గుర్తు చేసుకున్న నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా.. చిత్ర బృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

naga chaitanya sensational comments on his love story movie

ఆయన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్ కి, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకు ఎన్నో విషయాలు నేర్పించింది.. లవ్ స్టోరీ సినిమా జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అంటూ చైతన్య ఎమోషనల్ ట్వీట్ చేశాడు. దీంతో లవ్ స్టోరీ సినిమా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇటీవల వచ్చిన చైతూ థాంక్యూ మూవీ నిరుత్సాహపరిచినా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చే సినిమాపై నమ్మకంతో ఉన్నాడు చైతూ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now