Naga Chaitanya : ఎంత ప‌నిచేశావు స‌మంత‌.. నాగ‌చైత‌న్య ఎమోష‌న‌ల్‌..!

July 6, 2022 9:59 PM

Naga Chaitanya : విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో.. నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. థాంక్ యూ. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఇక రాశి ఖ‌న్నా, నాగ‌చైత‌న్యల‌తోపాటు ఇందులో న‌టించిన మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వారు ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక తాజాగా చైతూ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

థాంక్ యూ చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా చైత‌న్య మాట్లాడుతూ.. తాను జీవితంలో ముగ్గురు వ్య‌క్తుల‌కు థాంక్స్ చెబుదామ‌ని అనుకుంటున్నాన‌ని అన్నాడు. మొద‌ట త‌న త‌ల్లికి థాంక్స్ చెప్పాడు. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటూ పెంచింద‌ని తెలిపాడు. త‌న‌కు అంతులేని ప్రేమ‌ను పంచింద‌న్నాడు. అందువ‌ల్ల ఆమెకు థాంక్‌యూ చెబుతున్నాన‌ని అన్నాడు. ఇక త‌న తండ్రి కూడా త‌న ఆల‌నా పాల‌నా చూశార‌ని.. ఆయ‌న త‌న ఫ్రెండ్‌లా త‌న‌ను భావిస్తార‌ని చైతూ తెలిపాడు. క‌నుక నాగార్జున‌కు థాంక్స్ చెబుతున్నాన‌ని అన్నాడు.

Naga Chaitanya said thanks to three members know them
Naga Chaitanya

ఇక మూడోది వ్య‌క్తి కాదు.. కుక్క పిల్ల‌. అవును.. అది స‌మంత దగ్గ‌ర ఉండేది. దాన్ని ఆమెనే అప్ప‌ట్లో తీసుకువ‌చ్చింది. దాని పేరు హ‌ష్‌. హ‌ష్ అంటే త‌న‌కు ప్రాణ‌మ‌ని.. త‌న వెనుక‌నే తిరిగేద‌ని.. సొంత మ‌నిషిలా చూసుకునేదని నాగ‌చైత‌న్య ఎమోష‌న‌ల్ అయ్యాడు. దానికి కూడా థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు హ‌ష్ చైతూ ద‌గ్గ‌ర లేదు. స‌మంత‌తో విడిపోయాక ఆమె త‌న కుక్క‌ను తాను తీసుకెళ్లింది. ఇక ఆమె ద‌గ్గ‌ర హ‌ష్‌తోపాటు సాషా అనే ఇంకో కుక్క పిల్ల కూడా ఉంది. అయితే స‌మంత ద‌గ్గ‌ర ఉన్న కుక్క పిల్ల‌ను త‌ల‌చుకుని చైతూ ఎమోష‌న‌ల్ అవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. చూస్తుంటే స‌మంత క‌న్నా హ‌ష్‌తోనే చైతూకు అనుబంధం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment