Naga Chaitanya : కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడం ఏమోగానీ సమంతపై నాగచైతన్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కనీసం భర్త అని కూడా పిలవడానికి ఆమె ఇష్ట పడడం లేదంటే.. ఆమె చైతన్యపై ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తామిద్దరినీ ఇప్పుడు ఒకే రూమ్‌లో బంధిస్తే తమ వద్ద పదునైన వస్తువులు ఉండకుండా చూడాలని చెప్పింది. అంటే శత్రుత్వం ఆ రేంజ్‌లో ఉందని.. వీరిద్దరి విడాకులు మామూలుగా కాలేదని అర్థమవుతోంది. అయితే ఇద్దరి మధ్య ఇంతటి గ్యాప్ ఎందుకు వచ్చిందనే.. చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు సమంత హద్దు మీరి కామెంట్స్ చేసింది. విడాకుల ప్రకటన కొత్తలో ఆమె సోషల్ మీడియాలో అనేక సందేశాలను పోస్ట్ చేసింది. అవన్నీ చైతన్యను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా చేసినవే. అయినప్పటికీ చైతన్య మౌనంగానే ఉన్నాడు. సమంత గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అలాగే అప్పటి నుంచి ఆమె ఇన్‌డైరెక్ట్‌గా చైతూపై కామెంట్స్ చేస్తూనే వస్తోంది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో మరోసారి రెచ్చిపోయింది. ఈసారి డైరెక్ట్ అటాక్ చేసింది. అయితే ఈసారి మాత్రం నాగచైతన్య బాగా ఫీలయ్యాడట. తీవ్ర మనస్థాపం చెందాడట. దీంతో ఆయన తాము తీసుకున్న ఫొటోలు అన్నింటినీ కాల్చేసినట్లు తెలుస్తోంది.
సమంత ఇన్ని సార్లు ఎన్ని మాటలను అన్నా చైతన్య మాత్రం ఓర్పుగానే ఉన్నాడు. అన్నింటినీ భరించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంక ఆమె మాటల దాడికి భరించలేకపోయాడట. దీంతో వారు కలసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోలను చైతూ కాల్చేశాడట. అలాగే సమంతకు చెందిన ఏ జ్ఞాపకమూ తనకు వద్దని.. ఏం మాయ చేశావె సినిమా టైమ్‌లో రాసిన అగ్రిమెంట్‌ను, వారు నటించిన సినిమాల తాలూకు అగ్రిమెంట్‌లను కూడా.. చైతూ చించేశాడట. ఇక ప్రస్తుతం నాగార్జునతో కాకుండా ఒక్కడే సింగిల్‌గా ఓ అపార్ట్‌మెంట్‌లో వీరందరికీ దూరంగా చైతూ ఉంటున్నాడట. ఈ క్రమంలోనే చైతూపై నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం ముందు ముందు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…