బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో చైతూ సినిమా..?

August 19, 2022 2:25 PM

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో అల‌రించిన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైత‌న్య లాల్ సింగ్ చ‌డ్డా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమా హిట్ అయితే చైతూకి వ‌రుస‌గా బాలీవుడ్ ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం. భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ డైరెక్టర్స్ లో ఒకరైనా సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఇటీవలే గంగూబాయి కతియావాడితో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆలియా భట్ ఈ సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కింది.

అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. నాగ‌చైత‌న్య‌తో చేతులు క‌లుప‌నున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా చైత‌న్య‌, సంజ‌య్ భ‌న్సాలీని క‌లిశాడ‌ట‌. వీరిద్ద‌రి క‌లయిక‌లో ఓ మూవీ కోసం చ‌ర్చ‌లు జ‌రిగినట్లు బాలీవుడ్ వ‌ర్గాల సమాచారం. అయితే గతంలో పుష్ప రిలీజ్ తరువాత.. అల్లు అర్జున్ కూడా సంజయ్ ను కలిశారు. వీరిద్దరూ ఓ సినిమా చేయబోతున్నారని అనుకున్నారు. కానీ ఇంత వరకూ ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.

naga chaitanya may entry into bollywood

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చ‌డ్డా ఆగ‌స్టు 11న విడుద‌ల కానుంది. అమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. దీనితో పాటుగా నాగ చైత‌న్య‌.. విక్ర‌మ్ కుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో దూత అనే హార్ర‌ర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి వరుస సక్సెస్ లతో జోరు మీదున్నాడు చైతూ. అయితే నాగ‌చైత‌న్య స్పీడ్‌కు ఈ మధ్యే థాంక్యూ మూవీ బ్రేక్‌లు వేసింది. భారీ అంచ‌నాల‌తో జూలై 22న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్యూర్‌ గా నిలిచింది. మ‌రి ఆయ‌న బాలీవుడ్‌లో ఏ మేర రాణిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now