Naga Chaitanya : వెబ్ సిరీస్‌కు రెడీ అవుతున్న నాగ‌చైత‌న్య.. క్రేజీ టైటిల్‌..!

February 5, 2022 7:09 PM

Naga Chaitanya : అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయ‌న న‌టించిన థాంక్ యూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అందులో చైతూకు జంట‌గా రాశిఖ‌న్నా న‌టించింది. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా.. చైతూ ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో త్వ‌ర‌లో స్ట్రీమ్ కానుంది.

Naga Chaitanya may act in amazon prime horror thriller series
Naga Chaitanya

చైతూ న‌టించ‌నున్న వెబ్ సిరీస్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది. దీన్ని హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇందులో చైత‌న్య పాత్ర చాలా వైవిధ్య భ‌రితంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇక దీనికి మ‌నం సినిమా ఫేమ్ విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని స‌మాచారం.

ఇక ఈ సిరీస్‌కు ధూత అనే డిఫ‌రెంట్ టైటిల్‌ను అనుకుంటున్నార‌ట‌. ఈ సిరీస్‌లో చైతూ చాలా త్వ‌ర‌గా షూటింగ్ ముగించుకోనున్నాడ‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత ఇంకో ప్రాజెక్టులో చైతూ న‌టించ‌నున్నాడు. ఇక చైత‌న్య న‌టించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇందులో అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now