Naga Chaitanya : నాగ‌చైత‌న్య కొత్త స్పోర్ట్స్‌ లుక్‌.. భ‌లే ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!

February 4, 2022 1:43 PM

Naga Chaitanya : సాయిప‌ల్ల‌వితో క‌లిసి న‌టించిన ల‌వ్ స్టోరీతోపాటు కృతిశెట్టితో న‌టించిన బంగార్రాజు చిత్రాలు హిట్ అయ్యే స‌రికి అక్కినేని నాగ‌చైత‌న్య మంచి జోరు మీదున్నాడు. ఈ క్ర‌మంలోనే చైతూ ప్ర‌స్తుతం థాంక్ యూ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం ర‌ష్యాలోని మాస్కోలో జ‌రుగుతోంది. మూవీకి చెందిన చివ‌రి షెడ్యూల్‌ను అక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీలో చైత‌న్య ప‌క్క‌న రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Naga Chaitanya latest sports look is very interesting
Naga Chaitanya

ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా చైతన్య‌, రాశిఖ‌న్నాలు తాము తీసుకున్న ఫొటోల‌ను షేర్ చేశారు. ఇక తాజాగా చైతూ ఇంట్రెస్టింగ్ లుక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్.. చైతూను ప్రొఫైల్ ఫొటో తీశారు. అందులో చైత‌న్య అద్దాలు ధరించి.. ద‌ట్ట‌మైన గ‌డ్డంతో.. స్పోర్ట్ లుక్‌లో మెరిసిపోతున్నాడు.

ఇక ఈ ఫొటోను షేర్ చేసిన చైతూ.. పీసీ స‌ర్‌, థాంక్ యూ ది మూవీ అని కామెంట్ పెట్టాడు. ఈ క్ర‌మంలోనే చైతూ కొత్త లుక్ ఫొటో వైర‌ల్‌గా మారింది. ఈ లుక్‌ను చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా థాంక్ యూ మూవీకి విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. బీవీఎస్ ర‌వి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వ‌చ్చే వేస‌విలో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now