Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అంటే నాగ చైతన్య, సమంత ఠక్కున గుర్తొచ్చే వారు. అక్టోబర్ 2న ఈ జంట విడిపోతున్నట్టు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇది ఫ్యాన్స్‌ని ఎంతగా బాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడిపోయిన దగ్గర నుండి సమంత- చై మాట్లాడుకున్నది లేదు, కలిసింది లేదు. కనీసం అకేషన్స్ రోజు కూడా విషెస్ చెప్పుకోలేదు. ఇన్నాళ్లూ అన్యోన్యంగా ఉన్న ఈ జంట ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది.
అయితే చాలా రోజుల తర్వాత నాగ చైతన్య- సమంత ఒకే లొకేషన్‌లో షూటింగ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైతన్య నటిస్తున్న బంగార్రాజు షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుపుకుంటుండగా, సమంత నటిస్తున్న యశోద కూడా రామానాయుడు స్టూడియోలోనే షూటింగ్ జరుపుకుంటోంది. నేటితో బంగార్రాజు చిత్రానికి ప్యాకప్ చెప్పాడు చైతూ. ఈ విషయాన్ని నాగ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అయితే ఒకే లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్న చైతూ- సామ్‌లు కలిశారా, మాట్లాడుకున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. కాగా ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించి అదుర్స్ అనిపించింది సమంత.
తొలిసారి స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. తన స్టెప్పులతో.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం యశోద సినిమా చేస్తోంది. ఇక చైతూ ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తూనే, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…