Naga Chaitanya : ఇంట్రెస్టింగ్‌.. ఒకే లొకేష‌న్‌లో నాగ చైత‌న్య‌, స‌మంత షూటింగ్‌..!

December 24, 2021 5:20 PM

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అంటే నాగ చైత‌న్య‌, స‌మంత ఠ‌క్కున గుర్తొచ్చే వారు. అక్టోబ‌ర్ 2న ఈ జంట విడిపోతున్న‌ట్టు తమ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఇది ఫ్యాన్స్‌ని ఎంత‌గా బాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విడిపోయిన ద‌గ్గ‌ర నుండి స‌మంత‌- చై మాట్లాడుకున్న‌ది లేదు, క‌లిసింది లేదు. కనీసం అకేష‌న్స్ రోజు కూడా విషెస్ చెప్పుకోలేదు. ఇన్నాళ్లూ అన్యోన్యంగా ఉన్న ఈ జంట ప్ర‌స్తుతం బ‌ద్ధ శ‌త్రువులుగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది.

Naga Chaitanya and samantha shooting in same location

అయితే చాలా రోజుల తర్వాత నాగ చైత‌న్య‌- స‌మంత ఒకే లొకేష‌న్‌లో షూటింగ్ చేయడం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది. చైతన్య న‌టిస్తున్న బంగార్రాజు షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జ‌రుపుకుంటుండ‌గా, స‌మంత న‌టిస్తున్న య‌శోద కూడా రామానాయుడు స్టూడియోలోనే షూటింగ్ జ‌రుపుకుంటోంది. నేటితో బంగార్రాజు చిత్రానికి ప్యాక‌ప్ చెప్పాడు చైతూ. ఈ విష‌యాన్ని నాగ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

అయితే ఒకే లొకేష‌న్‌లో షూటింగ్ చేస్తున్న చైతూ- సామ్‌లు క‌లిశారా, మాట్లాడుకున్నారా అనేది మాత్రం స‌స్పెన్స్ గా మారింది. కాగా ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో నటించి అదుర్స్ అనిపించింది సమంత.

తొలిసారి స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. తన స్టెప్పులతో.. కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్‏తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం యశోద సినిమా చేస్తోంది. ఇక చైతూ ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తూనే, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now