Naga Babu : నిహారిక అరెస్టుపై స్పందించిన నాగ‌బాబు.. త‌న కూతురు త‌ప్పేమీ లేద‌ట‌..!

April 3, 2022 6:29 PM

Naga Babu : బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో డ్రగ్స్ వ్య‌వ‌హారం ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెల్ల‌వారుఝామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే.

Naga Babu responded over his daughter Niharika arrest
Naga Babu

డ్రగ్స్ కేసులో మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు బయటకు రావడంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని.. నిహారిక వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఓ వీడియో విడుద‌ల చేస్తూ ఇందులో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. డ్రగ్స్ కేసుపై నేను స్పందించడానికి గల కారణం.. పబ్‌పై దాడులు జరిగిన సమయంలో నా కూతురు నిహారిక అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్‌ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నిహారికకు సంబంధించినంత వరకు ఆమె చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదు. సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని నాగబాబు విజ్ఞప్తి చేశారు. మ‌రి నాగ‌బాబు విజ్ఞ‌ప్తి మేర‌కు అయిన ప్ర‌చారాలు ఆగుతాయా అనేది చూడాలి. మ‌రో వైపు ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ కూడా నిహారిక ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని తెలియ‌జేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now