Aryan Khan : ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌.. చివ‌రి నిమిషంలో ఎన్‌సీబీ కీల‌క ఆధారాలు.. బెయిల్ ఇచ్చేది లేద‌ని చెప్పిన కోర్టు..!

October 20, 2021 4:42 PM

Aryan Khan : డ్ర‌గ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్య‌న్ ఖాన్‌కు కోర్టు షాకిచ్చింది. ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిష‌న్‌ను కోర్టు విచారించి విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇస్తుంద‌ని అంతా భావించారు. ఈ మేర‌కు ఆర్య‌న్ ఖాన్ తండ్రి షారూఖ్ ఖాన్‌, ఆయ‌న త‌ర‌ఫున లాయ‌ర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహ‌నాల‌ను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఎన్‌సీబీ అధికారులు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు మ‌రోమారు నిరాక‌రించింది.

mumbai court denied bail to Aryan Khan after ncb submitted whatsapp chats

ఆర్య‌న్‌ఖాన్ ఇప్ప‌టికే బెయిల్ కోసం ప‌లుమార్లు పిటిష‌న్ పెట్టుకున్నా.. అత‌ను బ‌య‌ట‌కు వ‌స్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయ‌న్న ఎన్‌సీబీ వాద‌న‌తో ఏకీభ‌వించిన కోర్టు అత‌నికి బెయిల్ మంజూరు చేయ‌లేదు. దీంతో మ‌రోసారి అత‌ను బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అత‌ని బెయిల్ పిటిష‌న్ ను విచారించిన కోర్టు విచార‌ణ‌ను బుధ‌వారంకు వాయిదా వేసింది. అయితే ఆఖ‌రి నిమిషంలో బెయిల్ వ‌స్తుంద‌నే అంతా అనుకున్నారు. కానీ ఎన్‌సీబీ అధికారులు ఆర్య‌న్ ఖాన్‌కు చెందిన ప‌లు కీల‌క వాట్సాప్ చాట్‌ల‌ను కోర్టు ఎదుట ఉంచారు.

షిప్‌లో అంద‌రూ డ్ర‌గ్స్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఓ ప్ర‌ముఖ ఔత్సాహిక బాలీవుడ్ హీరోయిన్‌కు ఆర్య‌న్ ఖాన్ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాడు. అత‌ను చాలా సేపు ఆ స‌మ‌యంలో ఆమెతో చాట్ చేశాడు. ఆ చాట్‌ల‌లో డ్ర‌గ్స్‌కు సంబంధించిన ప్రస్తావ‌న ఉంది. వాటిని బ‌ట్టి అత‌ను డ్ర‌గ్స్‌ను అంద‌రికీ స‌ర‌ఫ‌రా చేస్తాడ‌ని.. ఎన్‌సీబీ ధ్రువీక‌రించింది. ఆ చాట్‌ల‌కు చెందిన ప‌త్రాల‌ను ఎన్‌సీబీ అధికారులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో కేసు మ‌రీ బ‌లంగా ఉంద‌ని భావించిన న్యాయ‌స్థానం ఆర్య‌న్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. అత‌నితోపాటు మ‌రో ఇద్ద‌రికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో అత‌నికి మ‌రిన్ని రోజుల పాటు క‌స్ట‌డీ ఇవ్వ‌నుంది.

కాగా కోర్టులో విచార‌ణ‌లు ముగిసిన వెంట‌నే అధికారులు ఆర్య‌న్‌ను మ‌ళ్లీ జైలుకు పంపించారు. దీంతో ఆర్య‌న్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. ఈరోజు క‌చ్చితంగా బెయిల్ వ‌స్తుంద‌నుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్ప‌టికీ ఎన్‌సీబీ కీల‌క ఆధారాల‌ను స‌మ‌ర్పించ‌డంతో వ‌చ్చే బెయిల్ రాకుండా పోయింది. దీంతో షారూఖ్‌కు మ‌ళ్లీ విచారం త‌ప్ప‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now