Mukul Rohatgi : ఎన్‌సీబీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే దాదాపుగా 20 రోజులకు పైగానే ఆర్యన్ జైలులో ఉన్నాడు. పైగా షారూఖ్‌ఖాన్‌కు చెందిన లీగల్ టీమ్‌లో హేమాహేమీల్లాంటి లాయర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆర్యన్‌కు బెయిల్ తేవడంలో విఫలం అయ్యారు.
అయితే వచ్చీరాగానే ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపించి చాలా సులభంగా బెయిల్ వచ్చేలా చేశారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోతోంది. అయితే ఇంతకీ అసలు ముకుల్ రోహత్గీ ఎవరు ? ఈయన విశేషాలు ఏమిటి ? అంటే..
ముకుల్ రోహత్గీ 14వ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఈయనకు 66 ఏళ్లు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్‌గా ఈయనకు అపారమైన అనుభవం ఉంది. అలాగే గతంలో ఈయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలోనూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ఈయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు.
అనేక సంక్లిష్టమైన కేసులను వాదించిన లాయర్ గా ఆయనకు పేరుంది. ఈయన 2002 గుజరాత్ అల్లర్ల కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించారు. అలాగే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ కు సంబంధించిన కేసులో అడిషనల్ సాలిసిటర్ జనరల్‌గా ఈయన అద్భుతంగా పనిచేశారు.
సీబీఐ స్పెషల్ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసులో ఈయన ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియామకం అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు ఈయనకు రూ.1.20 కోట్ల ఫీజును చెల్లించింది. అది ఒక హైప్రొఫైల్ కేసు కావడం విశేషం. ఈ కేసులో విచారణ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముకుల్ రోహత్గీ కోర్టు నిర్ణయాన్ని్ స్వాగతించారు. ఇది ఏప్రిల్ 2018లో జరిగింది.
ఇక మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ముకుల్ రోహత్గీ స్నేహితులు. తమ స్నేహం గురించి ఇద్దరూ అప్పుడప్పుడు చెబుతుండేవారు. ఇక ముకుల్ రోహత్గీ తండ్రి జడ్జి కావడం విశేషం. ఆయన పేరు అవధ్ బెహరి రోహత్గీ. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముకుల్ రోహత్గీ నడిచారు. గొప్ప లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. తరువాత న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
ప్రారంభంలో ఆయన యోగేష్ కుమార్ సభర్వాల్ వద్ద పనిచేశారు. తరువాత ఢిల్లీ హైకోర్టుకు 36వ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం సొంతంగా సీనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1993లో ముకుల్ రోహత్గీ ఢిల్లీ హైకోర్టు చేత సీనియర్ కౌన్సిల్‌గా నియామకం అయ్యారు. అనంతరం 1999లో అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియామకం అయ్యారు. ఆయన భార్య పేరు సుధ. ఆమె కూడా లాయర్. కాగా ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…