MS Dhoni : చెన్నైకి కెప్టెన్‌గా త‌ప్పుకోనున్న ధోనీ..? ఆ ప్లేయ‌ర్ల‌లో ఎవ‌రో ఒక‌రికి కెప్టెన్సీ ఛాన్స్‌..?

January 15, 2022 4:01 PM

MS Dhoni : భార‌త క్రికెట్ జ‌ట్టును మ‌హేంద్ర సింగ్ ధోనీ ఎంత విజ‌య‌వంతంగా న‌డిపించాడో అంద‌రికీ తెలిసిందే. ధోనీ సార‌థ్యంలో టీమిండియా టీ20, వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్‌ల‌తోపాటు ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ విజ‌యం సాధించింది. ఇక అటు ఐపీఎల్‌లోనూ ధోనీ చెన్నైకి అనేక విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టాడు. 2020 ఐపీఎల్ టోర్నీలో చెన్నై పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చూపించినా.. 2021లో మాత్రం మ‌రోమారు ట్రోఫీని సాధించి స‌త్తా చాటారు. ఇదంతా ధోనీ చ‌ల‌వే అని ఫ్యాన్స్ ఎవ‌ర్ని అడిగినా చెబుతారు.

MS Dhoni may hand over captaincy to other players in chennai ipl team

అయితే వ‌చ్చ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో కేవ‌లం కొద్ది మంది ప్ర‌ముఖ ప్లేయ‌ర్ల‌ను మాత్ర‌మే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకుని మిగిలిన వారిని వేలంలో ప్ర‌వేశ‌పెట్టాయి. దీంతో ఈసారి 250 మంది ప్లేయ‌ర్లు వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇక చెన్నై టీమ్ కూడా ఈ సారి భారీ ఎత్తున మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ధోనీ, జ‌డేజా వంటి వారిని మాత్ర‌మే ద‌గ్గ‌రే పెట్టుకోనుంది.

ఇక ఈ సారి ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడ‌ని నిర్దార‌ణ అవుతున్నా.. కెప్టెన్‌గా మాత్రం ధోనీ కొన‌సాగ‌డ‌ని తెలుస్తోంది. ధోనీ త‌న కెప్టెన్సీని ర‌వీంద్ర జ‌డేజా లేదా రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ధోనీ ఓ వైపు టీమ్‌లో ఉంటూనే మ‌రోవైపు కెప్టెన్‌గా వేరే ప్లేయ‌ర్‌ను నియ‌మించ‌నున్నారు. దీంతో జ‌ట్టు భ‌విష్య‌త్తులోనూ మ‌రింత బ‌లంగా ఉంటుంద‌ని మేనేజ్‌మెంట్ విశ్వ‌సిస్తోంది. అయితే వ‌చ్చే ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటాడా.. లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now