MP Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో అస‌లైందేన‌ట‌.. సాక్ష్యం ఇదే..

August 13, 2022 6:58 PM

MP Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కి చెందిన‌దిగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న ఓ వీడియో వ్య‌వ‌హారం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. గ‌త వారం రోజులుగా అంత‌టా ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాశం అవుతోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదివ‌ర‌కే మాధ‌వ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది. అయితే ఈ విష‌యంలో టీడీపీ మాత్రం త‌గ్గ‌డం లేదు. టీవీల్లో చ‌ర్చ‌లు, ఇంట‌ర్వ్యూలు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలుగుదేశం పార్టీ ఇంకో అడుగు ముందుకేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

స‌ద‌రు ఎంపీదిగా చెప్ప‌బ‌డుతున్న ఆ వీడియోని అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ కు ప‌రీక్షకు పంప‌గా అది అస‌లైన వీడియోనే అని.. అందులో ఉన్న‌ది గోరంట్ల మాధ‌వే అని రిపోర్ట్ లో తేల్చారు. ఈ మేరకు టీడీపీ ఈ ప‌రీక్ష‌లు చేయించింది. ఈ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ ప్ర‌తినిధి ప‌ట్టాభి మీడియా ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ.. తాము ఆ వీడియోని అమెరికాలోని ప్ర‌ఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ఎక్లిప్స్ ల్యాబ్ కి పంపామ‌ని చెప్పారు.

MP Gorantla Madhav video is real says TDP leader Pattabhi
MP Gorantla Madhav

అయితే ఆ వీడియోలో ఎటువంటి గ్రాఫిక్స్ లేవ‌ని, మార్ఫింగ్ కూడా జ‌ర‌గ‌లేద‌ని ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల్లో ఋజువైంద‌ని ప‌ట్టాభి తెలియ‌జేశారు. ఈ మేర‌కు రిపోర్టుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. ఇక ఆ ల్యాబ్ అధ్య‌క్షుడు జిమ్ స్టాఫ్పోర్డ్ కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించార‌ని అన్నారు. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తున్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now