OTT : సినిమా ఇండస్ట్రీకి ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అదే ఊపుతో సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో పలు యంగ్ హీరోల సినిమాలు థియేటర్లలోకి అడుగపెట్టాయి. అయితే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా తగ్గేదిలేదంటూ ఈవారం కూడా కొన్ని వైవిధ్యమైన సినిమాలు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. అక్టోబర్ మూడోవారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో చూద్దాం..
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చే మూవీ లిస్ట్ ఏంటంటే.. శర్వానంద్ నటించిన ఓకే ఒక జీవితం.. ఈ మూవీ ఇటీవలి కాలంలో శర్వాకి మంచి హిట్ ఇచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 20 నుండి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. ఇది ఫ్యామిలీ డ్రామా అంశాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 21 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర అక్టోబర్ 23 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఇది హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కించిన ఫాంటసీ థ్రిల్లర్. అలాగే కృష్ణ వ్రింద విహారి నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన కామెడీ మూవీ. ఇటీవల కాలంలో క్లీన్ కామెడీగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…