OTT : ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న చిత్రాలు ఇవే..!

OTT : వారం వారం ఓటీటీల్లో ప్రస్తుతం కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. థియేటర్ల కన్నా ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ సినిమాలకు వసూళ్లు మాత్రం రావడం లేదు. ప్రేక్షకులు లేక అనేక చోట్ల థియేటర్లకు భారీ ఎత్తున నష్టాలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మళయాళం స్టార్‌ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన మళయాళం మూవీ కడువ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఆగస్టు 4వ తేదీన స్ట్రీమ్‌ కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆలియా భట్‌ నటించిన డార్లింగ్స్ అనే మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతోంది. కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్‌ చేయనున్నారు. ఆగస్టు 4వ తేదీనే ఈ మూవీ కూడా విడుదల కానుంది.

OTT

గోపీ చంద్‌, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన పక్కా కమర్షియల్‌ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సాధించినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇక ఈ మూవీ ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఆహా వీడియోతోపాటు నెట్‌ ఫ్లిక్స్‌ లో ఈ మూవీని ఆగస్టు 5వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. అలాగే ది శాండ్‌ మాన్‌ అనే ఇంగ్లిష్‌ సిరీస్‌ సైతం నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ వారమే స్ట్రీమ్‌ కానుంది. సై-ఫై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ను ఆగస్టు 5 నుంచి స్ట్రీమ్‌ చేయనున్నారు. ఇలా పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM