Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ దర్శకుడు ఫిక్స్‌..?

May 31, 2022 12:35 PM

Mokshagna : నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎన్‌టీఆర్‌ లాంటి మహా నటుడి కొడుకు అయినా సరే బాలయ్య నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే బాలకృష్ణ తరువాత ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎప్పుడు కనిపించినా ఆయన లుక్‌ ఫ్యాన్స్ ను షాక్‌ కు గురి చేస్తోంది. ఎల్లప్పుడూ లావుగా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే మోక్షజ్ఞ ప్రస్తుతం చదువుకుంటున్నాడని.. త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని.. ఆదిత్య 369 రీమేక్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మోక్షజ్ఞ చదువుకుంటున్నాడు కనుక ఫిట్‌ నెస్‌పై దృష్టి సారించలేదని.. అయితే సినిమాల్లోకి వచ్చేముందు కచ్చితంగా ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. అయితే ఈ మధ్య మళ్లీ మోక్షజ్ఞకు చెందిన ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో మోక్షజ్ఞ కాస్త బరువు తగ్గినట్లు కనిపించినా.. ఓవరాల్‌గా చూస్తే ఇంకా లావుగానే ఉన్నాడు. అయితే అతను సినిమా కోసమే బరువు తగ్గుతున్నాడని తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞను ఏ దర్శకుడితో పరిచయం చేయాలా.. అని బాలకృష్ణ ఇన్ని రోజులూ తెగ ఆలోచించారట. ఈ క్రమంలోనే ఓ దర్శకున్ని ఆయన ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

movies entry prepared for Mokshagna he may be the director
Mokshagna

గతంలో పూరీ జగన్నాథ్‌ ద్వారా మోక్షజ్ఞ తొలి సినిమా తీయించాలనుకున్నారు. కానీ పూరీ జగన్నాథ్‌ అంటే కేవలం మాస్‌ లేదా లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ వస్తుంది. అలా కాకుండా మోక్షజ్ఞలో ఉన్న టాలెంట్స్‌ అన్నీ ప్రేక్షకులకు తెలిసేలా చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. అంటే.. ఎలాంటి సీన్లలో అయినా నటించే సత్తా ఉందని మోక్షజ్ఞ నిరూపించుకోవాలన్నమాట. అలా జరగాలంటే ఆయన నటించే సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ ఉండాలి. అలాంటి ఎలిమెంట్స్‌తో సినిమా తీయగల సత్తా అనిల్‌ రావిపూడికి ఉందని బాలకృష్ణ భావిస్తున్నారట. దీంతో సినిమా విడుదలైతే మోక్షజ్ఞ టాలెంట్స్‌ ఏంటో ప్రేక్షకులకు తెలుస్తాయి. అప్పుడు వారు అతన్ని ఆదరించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా బాలయ్య ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌, పేరు, బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ లక్‌ కూడా కలసి రావాలి. అలా కలసి రాకపోవడం వల్లే కొందరు హీరోలు ఇప్పటికీ సినిమా రంగంలో రాణించలేకపోతున్నారు. కనుక మోక్షజ్ఞ విషయంలో అలా జరగకుండా ఉండాలని బాలకృష్ణ ఇప్పటి నుంచే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు.. నిజంగానే అనిల్‌ రావిపూడితో తన మొదటి సినిమా చేస్తారా.. అన్న విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now