OTT : ఈ వారం ఓటీటీల‌లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

January 31, 2022 8:55 PM

OTT : వారం మారిందంటే చాలు.. ప్రేక్ష‌కులు ఓటీటీల్లో ఈ వారం ఏయే మూవీలు, సిరీస్‌లు విడుద‌ల‌వుతున్నాయి.. వేటిని చూడాలి.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాల‌ను, సిరీస్‌ను విడుద‌ల చేస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీ యాప్‌ల‌లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

movies and series streaming on OTT this week must watch
OTT

వ‌న్ క‌ట్ టూ క‌ట్ అనే క‌న్న‌డ సినిమా ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన స్ట్రీమ్ చేస్తారు. ఇది ఒక కామెడీ డ్రామా సినిమా. క‌మెడియ‌న్ ద‌నీష్ సైత్ ఇందులో లీడ్ రోల్‌లో న‌టించారు. ఇటీవ‌లే గుండె పోటుతో మ‌ర‌ణించిన సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

లూప్ ల‌పేటా అనే సినిమా ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. జ‌ర్మ‌న్ మూవీ ర‌న్ లోలా ర‌న్ ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో తాప్సీ, తాహిర్ రాజ్‌, శ్రేయ్ ధ‌న్వంత‌రిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థ్రిల్ల‌ర్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

నెట్ ఫ్లిక్స్‌లోనే ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఓ సిరీస్‌ స్ట్రీమ్ కానుంది. మ‌ర్డ‌ర్ విల్లె అనే కామెడీ డ్రామా సిరీస్ ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇందులో విల్ అర్నెట్‌, హ‌నీఫ్ వుడ్‌, లిల‌న్ బౌడెన్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో నటించారు.

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన జీ5 యాప్‌లో 100 అనే క‌న్న‌డ మూవీ స్ట్రీమ్ కానుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

OTT : రాకెట్ బాయ్స్ కామెడీ డ్రామా సిరీస్

సోనీ లివ్ ఓటీటీ యాప్‌లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన రాకెట్ బాయ్స్ అనే కామెడీ డ్రామా సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇందులో స‌ర్‌భి, ఇశ్వ‌క్ సింగ్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఇద్ద‌రు అద్భుత‌మైన భార‌తీయ సైంటిస్టులు హోమి భాభా, విక్ర‌మ్ సారాభాయ్‌ల జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సిరీస్‌ను తీశారు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ యాప్ లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి ది గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. మిస్ట‌రీ క‌థాంశంతో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు.

అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన రండు అనే మ‌ళ‌యాళం సినిమా స్ట్రీమ్ కానుంది. కామెడీ సినిమాగా దీన్ని తెర‌కెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now