OTT : ప్రతి శుక్రవారం థియేటర్‌లలో చాలా సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు థియేటర్స్ కన్నా ఓటీటీలో మంచి వినోదం పంచేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వారం పలు చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఇతర ఒటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ కానున్న సినిమాల జాబితాని పరిశీలిస్తే.. వరుణ్ తేజ్ నటించిన గని.. బాక్సాఫీస్ పరంగా వాష్ అవుట్ అయ్యింది. ఈ చిత్రం బాక్సింగ్ డ్రామాగా ప్రచారం చేయబడింది. ఇది థియేటర్‌లలో ప్రవేశించిన సరిగ్గా 2 వారాల తర్వాత ఈ నెల 22న ఆహా యాప్‌లో వస్తోంది.
ఇంగ్గిష్ కామెడీ ఓరియెంటెడ్ క్రైమ్ డ్రామా సిరీస్ బెటర్ కాల్ సౌల్ సీజన్ 6 ఈ నెల 19వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇక ఓ మై డాగ్ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఇందులో తండ్రీ కొడుకులు అరుణ్ విజయ్, అర్నవ్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక తమిళ డ్రామా అనంతం చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది. అనంతం అనే తమిళ భాషా చిత్రంలో ప్రకాష్ రాజ్, సంపత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఈ నెల 22న జీ5లో ప్రీమియర్ అవుతోంది.
అన్‌చార్టెడ్ అనేది టామ్ హాలండ్, మార్క్ వాల్‌బర్గ్, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఆంగ్ల భాషా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడనుంది. ఇది ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీలలో ప్రసారం కానుంది. ఇలా పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీలలో తెగ సందడి చేయబోతున్నాయి. వీటి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…